News
భాజపా నేతపై గోరక్షకుల దాడి
గోవధలకు పాల్పడుతున్నారంటూ అమాయకుల్ని చావగొడుతున్న గోరక్షకులు ఇప్పుడు ఓ భాజపా నేతపై దాడి చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన సలీం షా అనే భాజపా నేత బీఫ్ తరలిస్తున్నాడన్న అనుమానంతో ఐదుగురు గోరక్షకులు అతనిపై దాడికి దిగారు. దాంతో అతను స్రృహకోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సలీంను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సలీం బీఫ్ తీసుకెళుతున్నాడా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను ఫోరెన్సిక్ బృందానికి అప్పగించారు. దీనిపై సలీం భార్య మాట్లాడుతూ.. తాము బీఫ్ తరలించడం లాంటవి చేయమని స్థానిక మసీదులో జరుగుతున్న కార్యక్రమానికి మాంసం తరలిస్తున్నామని తెలిపింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








